పనస పండును ఎవరు తినకూడదు?

శుక్రవారం, 28 మే 2021 (22:18 IST)
పనసకాయలు వచ్చే కాలం ఇది. పనస తొనలను ఎంతో ఇష్టంగా తింటుంటారు చాలామంది. ఐతే ఈ పనస కాయలను కొంతమంది తింటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. ముఖ్యంగా అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినకూడదు.
 
సహజంగా చెట్టుకు పండిన కాయను అలా తినేయకుండా ఇంట్లో ఒకటిరెండ్రు రోజులు నిలువపెట్టుకుని తింటే రుచిగా వుంటుంది. ఐతే ఈ పనస కాయల తొనలను అధికంగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్ష రెండూ కలిపి సారాలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. మరికొన్ని ఉపయోగాలు చూద్దాం.
 
1. పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. 
 
2. పనస తొనలు తినడం ద్వారా మగవారిలోవీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.
 
3. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది.రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టుల ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.
 
4. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
 
5. ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పిమరియు గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
6. పనస పండు షుగరు వ్యాది ఉన్నవారికి మంచి ఆాహారం. దీనిని తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.
 
7. పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాసు మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు