రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే ఆ హార్మోన్‌పై..?

మంగళవారం, 14 నవంబరు 2017 (13:53 IST)
ప్రస్తుతం టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోతోంది. అయితే వీటిలోని బ్లూ లైట్ వల్ల కంటికి ముప్పు తప్పదు. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. 
 
ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా  విడుదల అవుతుంది. అయితే రాత్రి పూట స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తే  ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్‌ఫై ప్రభావం చూపుతుంది. తద్వారా మెలటోనిన్ విడుదలను తగ్గిస్తుంది. అందుకే నిద్రలేమి సమస్య వేధిస్తుంది. అందుకే రాత్రి పూట స్మార్ట్ ఫోన్లను రాత్రిపూట ఉపయోగించకూడదు.
 
ఒకవేళ ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు