ఆధ్యాత్మికత అవసరం: బాబా రామ్‌దేవ్, సద్గురు జగ్గీ వాసుదేవ్

PR
బాబా రామ్‌దేవ్, సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూర్‌లోని వీఓసీ మైదానంలో మార్చి 31న కోయంబత్తూర్ ప్రజలకు తమ సందేశాలను అందజేశారు. ఉచిత యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబా రామ్‌దేవ్ సామాజిక ఆధ్యాత్మికత అవసరాన్ని, ప్రాముఖ్యతను తెలియజెప్పారు. సమాజంలోని అన్ని రంగాలలోకి ఆధ్యాత్మికతను చొప్పించాల్సిన అవసరం వుందని అన్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగింది. యోగా గురించి ఎప్పుడూ వినని ప్రజలకు కూడా యోగాను తెలియజేయటానికి బాబా రామ్‌దేవ్ అద్భుతమైన కృషి చేస్తున్నారని సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసించారు.

ప్రతి వ్యక్తికి జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. నేటి ఒత్తిడి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేలమంది ప్రజలు ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆస్థా ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

వెబ్దునియా పై చదవండి