ఓ చిరుత పులి మనిషిలా ఠీవీగా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చింది. స్టేషన్‌లోని అన్ని రూముల్లో కలియతిరిగి, ఆ తర్వాత తనదారిన తను వెళ్లిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషనులో ఈ చిరుత పులి కనిపించింది. స్టేషన్ అంతా ఓ రౌండ్ వేసి, ఎవరూ లేకపోవడంతో తిరిగి వెనక్కి వెల్లిపోయింది. చిరుత పులి బయటకు వెళ్లగానే ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.
కాగా, ఇటీవలి కాలంలో వన్యప్రాణులు జనావాస ప్రాంతాల్లోకి వచ్చిన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెల్సిందే. కొన్నిసందర్భాల్లో అటవీ ఏనుగులు కూడా వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అలాగే, చిరుత పులులు కూడా ఆహారం కోసం జనావాస ప్రాంతాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.