ఆరోగ్యానికి...సూర్య నమస్కారం!

భారతీయ జీవనశైలిలో యోగాకు ఓ ప్రత్యేక స్థానముంది. అందులోను సూర్య నమస్కారానికి చాలా ప్రాధాన్యత ఉంది. సూర్యుడు లేకుంటే జీవితమే లేదనుకునే తత్వం భారతీయులది. శరీరతత్వానికి, మేథస్సుకు బ్యాలెన్సింగ్‌గా ఉపయోగపడే ఈ సూర్య యోగాను దక్షిణ భారతంలో ఎక్కువగా ఆచరిస్తుంటారు.

దక్షిణ భారతంలోనే ప్రత్యేకంగా కేరళ రాష్ట్రాన్ని దేవతల సామ్రాజ్యం అనికూడా మన భారతీయులు అంటారు. అలాంటి కేరళలోని ప్రజలు తమ జీవితంలో సూర్య యోగాను అంతర్భాగంగా చేసుకున్నారు.

సూర్యుడు ఉదయించే సమయంలో లేదా సూర్యుడు అస్తమించే సమయంలో సుమారు 20 నిమిషాలు సూర్యున్ని చూడ్డం వారి జీవన విధానంలో ఓ భాగంగా మారింది. ప్రతీ రోజు గ్రూపులు గ్రూపులుగా ప్రజలు సూర్యున్ని తదేకంగా చూడ్డం అలవాటు చేసుకున్నారు.

సూర్యుడు ఉదయించే ముందు లేదా అస్తమయానికి 20 నిమిషాల ముందు అతి నీల లోహిత కిరణాలు తక్కువ మోతాదులో ఉండడంవల్ల సూర్యున్ని చక్కగా చూడొచ్చని యోగా గురువులు చెబుతున్నారు. ఎలాంటి కటకం లేకుండానే సూర్యున్ని చూడ్డానికి అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ఇలా సూర్యున్ని వీక్షించడం వలన శారీరక, మానసిక ఒత్తిడి దూరమవడంతోపాటు అంతర్లీనంగా శక్తి చేకూరుతుందని యోగా నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు కళ్ళకు దృష్టిలోపాలుంటేకూడా తొలగిపోతాయని వారంటున్నారు.

వెబ్దునియా పై చదవండి