ఈ రోజుల్లో చాలామందిని మైగ్రేన్ సమస్య పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఇది 30 నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కులలో తలెత్తుతుంది. ఇటీవల కాలంలో పన్నెండేళ్ల లోపు పిల్లల్లో కూడా ఇది కనబడుతోంది. ఈ సమస్యను వదిలించుకునేందుకు ఈ ఆసనాలు వేస్తే చాలంటున్నారు యోగా గురువులు.
శశాంకాసనం, శవాసనం, ఉష్ట్రాసనం, యోగముద్రాసనం ఈ సమస్యను పారదోలడంలో ఎంతో సహాయపడతాయి. ఇందులో శశాంకాసనం, శవాసనం చాలా సులభం కనుక గురువుగారి పర్యవేక్షణ అంతగా అవసరం లేదు. కానీ మిగిలినవాటికి ఖచ్చితంగా గురువు ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది.
ఇక తర్వాతది ప్రాణాయామం. సుఖప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయమం మొదలైనవి చేస్తే ఫలితం ఉంటుంది. ధ్యానం విషయానికి వస్తే... ధ్యానం, యోగనిగ్రహం చేస్తే మేలు కలుగుతుంది.