Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

సెల్వి

మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (22:32 IST)
Sritej father
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 చిత్రంలో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పుష్ప-2 కోసం ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ విషాద సంఘటన, శ్రీతేజ్ తల్లి రేవతి జీవితాన్ని బలిగొంది. 
 
మొత్తం నాలుగు నెలల 25 రోజులు శ్రీతేజ్ కిమ్స్‌లో చికిత్స పొందాడు. హాస్పిటల్ నుండి రీహాబిలిటేషన్ సెంటర్‌కు శ్రీతేజ్‌ను కుటుంబసభ్యులు తరలించారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని అతని తండ్రి తెలిపారు. కానీ మాట్లాడలేని స్థితిలో వున్నాడని.. నిలకడగా ఉన్న శ్రీతేజ్‌కు 15 రోజుల ఫిజియోథెరపీ సూచించారు. 

సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

గత డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్, 146 రోజుల చికిత్స అనంతరం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మాట్లాడలేని స్థితిలోనూ నిలకడగా ఉన్న శ్రీతేజ్‌కు 15 రోజుల… pic.twitter.com/EfsBWRmday

— ChotaNews App (@ChotaNewsApp) April 29, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు