ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే.. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తారు.
కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశములోని నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని వారిని ఆహ్వానించే దిశగానే కలశపూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం.