మెదడుతోనే మైఖేల్ జాక్సన్ మృతదేహం ఖననం

పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ భౌతికకాయాన్ని అతని మెదడుతో కలిపి అంతిమంగా ఖననం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు.

జాక్సన్ మృతిపై ఏర్పడిన సందేహాల నేపథ్యంలో ప్రస్తుతం వైద్య నిపుణులు ఆయన మెదడుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాక్సన్ అంతిమ అంత్యక్రియలు హాలీవుడ్‌లోని ఫారెస్టు లాన్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు బ్రిటన్ పత్రిక ది సన్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో.. మైఖేల్ మెదడుతో కలిపి జాక్సన్ మృతదేహానికి ఖననం నిర్వహించేందుకే ఆయన కుటుంబసభ్యులు అంతిమ అంత్యక్రియలను జాప్యం చేస్తున్నట్లు లండన్‌కు చెందిన మిర్రర్ ఆన్‌లైన్ ఓ కథనంలో తెలిపింది.

మరోవైపు లాస్ ఏంజెల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్‌లో జరిగిన జాక్సన్ అంత్యక్రియల కార్యక్రమాన్ని అమెరికాలో 3.11 కోట్లమందికి పైగా ప్రజలు టీవీల్లో తిలకించినట్లు నీల్సన్ మీడియా పరిశోధక సంస్థ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ మరణ ధ్రువీకరణ పత్రాలను గురువారం నుంచి లాస్ ఏంజెల్స్ ఆరోగ్య విభాగం అమ్మకానికి ఉంచింది. మంగళవారం మైఖేల్ అంత్యక్రియల ఘట్టం పూర్తయిన కొద్దిగంటలకు ఆయన మరణ ధ్రువీకరణ పత్రం విడుదలైంది. 50 సంవత్సరాల పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ గతనెల (జూన్) 26వ తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి