ది రాక్‌ డ్వేన్ జాన్సన్‌కు కరోనా.. భార్యాపిల్లలను కూడా వదలని కోవిడ్

గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:54 IST)
Dwayne Johnson
ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తోంది. కరోనా సోకిన వారిలో సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు వున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ కరోనా సోకింది.

హాలీవుడ్‌లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో డ్వేన్‌ జాన్సన్‌ ఒకరైన జాన్సన్‍తో పాటు ఆయన భార్య, పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఆయనే స్వయంగా తెలిపారు. ది రాక్‌‌గా అందరికీ సుపరిచితుడైన డ్వేజ్ జాన్సన్ తమ ఫ్యామిలీకి కరోనా సోకిన విషయాన్ని ఇన్‌స్టా‌గ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు. 
 
పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి తాను షాక్‌కు గురయ్యానని డ్వేన్ జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొన్న అత్యంత కఠిన సవాళ్లలో ఇదొకటని తెలిపారు. తన భారయ్ లారెన్ హా షైన్, ఇద్దరు కుమార్తెలకు కరోనా సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం తామంతా కోలుకున్నట్లు చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి చెందిన సన్నిహితుల ద్వారా కరోనా సోకిందని తెలిపారు. 
 
ఈ సందర్బంగా తన అభిమానులకు ప్రజలకు కీలక సూచనలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవాలన్నారు. విధిగా మాస్కులు ధరించాలన్నారు. అలాగే ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఇంటికి వచ్చే బంధువుల, స్నేహితుల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు