సీరియల్ రేపిస్టు వీన్ స్టీన్‌‌కి కరోనా పాజిటివ్ లక్షణాలు

సోమవారం, 23 మార్చి 2020 (12:36 IST)
హాలీవుడ్ మాజీ ప్రొడ్యూసర్ హార్వే వీన్ స్టీన్‌‌కి సీరియల్ రేపిస్టు అనే పేరుంది. ఇతనికి కోర్టు 23 ఏళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వీన్ స్టీన్‌కి సోకిందని.. న్యూయార్క్‌కు సంబంధించి ఓ పత్రిక వెల్లడించింది. 
 
తాజాగా అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 417 కి పెరిగింది. 33 వేల కేసులు నమోదయ్యాయి. హార్వే వీన్ స్టీన్‌ పలువురు సినీ తారలు, మాజీ మోడల్స్ పై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
ఇతనికి భయంకర కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు నయాగరా గెజిట్ తెలిపింది. హార్వేని న్యూయార్క్‌కి 350 మైళ్ళ దూరంలోని బఫెలో దగ్గరి జైలుకు తరలించారు. అంతకుముందు రైకర్స్ ఐలాండ్ జైల్లో ఉంచారు. ఛాతీ నొప్పికి గురైన ఇతడికి మన్ హటన్ లోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. . ఖైదీలతో కిక్కిరిసి ఉన్న న్యూయార్క్ జైళ్లలో వారికి కరోనా పాజిటివ్ సులభంగా సోకే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు