నేను రెండు సార్లు అత్యాచారానికి గురయ్యా... అమెరికా నటి ఇవాన్ రేచల్

గురువారం, 1 డిశెంబరు 2016 (10:56 IST)
సెలెబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని విషయాలను బహిర్గతం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అది మంచి సఘటన అయినా.. చెడు విషయమైనా సరే.. తమలో దాచిపెట్టుకునేందుకే మొగ్గు చూపుతారు. అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ నటి ఇవాన్ రేచల్ ఉడ్ మాత్రం తన జీవితంలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనను బహిర్గతం చేసింది. ఈ విషయాన్ని వెల్లడించడం ద్వారా తనలో ఎలాంటి దాపరికాలు లేవని తేల్చి చెప్పింది. 
 
ముఖ్యంగా.. తాను రెండుసార్లు ఆత్యాచారానికి గురైనట్టు చెప్పుకొచ్చింది. తొలిసారి.. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి రేప్‌ చేశాడని, ఆ తర్వాత ఒక బార్ యజమాని చేతిలో రేప్‌కు గురయ్యానని చెప్పుకొచ్చింది. మొదటి సారి ఎదురైన అనుభవం ద్వారా రెండోసారి జాగ్రత్త పడలేకపోయానని, పైగా బయపడ్డానని వెల్లడించింది. 
 
ఓ దశలో తాను 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ సంఘటనల గురించి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పింది. కానీ తాను ఏ తప్పూ చేయలేదని సర్ధిచెప్పుకుని ఆ ఆలోచనల నుంచి బయటపడ్డానని తెలిపింది. అయితే ఇలాంటి లైంగిక వేధింపుల గురించి ఆడవాళ్లు ఇక ఏమాత్రం సైలెంట్‌గా ఉండే పరిస్థితి లేదని అంటోంది. 

వెబ్దునియా పై చదవండి