తామర విత్తనాలకు అనేక పేర్లు ఉన్నాయి. లోటస్ సీట్, నట్, ఫాక్స్, మఖానా ఇలా పేరు ఏదైనా అవి అందించే పోషకాలు మాత్రం వెలకట్టలేనివి. వీటిలో విటమిన్లతో పాటు.. ఖనిజ లవణాలు, పీచు పదార్థాలతో పాటు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటితో తరుచూ పాప్‌కార్న్ చేసుకుని ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.
* తామర విత్తనాలు నిద్రలేమిని కూడా పోగొడుతాయి.
* వీటిలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువ, కాబట్టి భోజనానికీ భోజనానికీ మధ్య ఆరగించొచ్చు.