బార్లీ నీరు తాగితే కిడ్నీలో రాళ్లు ఏమవుతాయి?

మంగళవారం, 30 మే 2023 (23:27 IST)
బార్లీ నీరు. ఈ నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. బార్లీ విత్తనాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించగలవు. ఇవి శరీరం నుండి కాల్షియం, భాస్వరం వంటి వాటిని తొలగించడంలో సహాయపడే మూత్ర ఉత్పత్తిని పెంచుతాయి. బార్లీ విత్తనాలు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బార్లీ నీటిని తీసుకోవడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, పెరుగుదలను నివారిస్తాయి.
బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్థాలను బయటకు నెట్టివేసి ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపు మంటను బార్లీ నీరు తగ్గిస్తుంది.
 
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు బార్లీ నీటిని ప్రతిరోజు తాగటం వలన శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. బార్లీ నీటిలో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది, గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఈ పానీయాన్ని సేవించటం ఉపయోగకరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు