తీపి మధురం సపోటా.. పోషకాల గని...

గురువారం, 11 మే 2023 (11:39 IST)
సపోటా పండు తీపి మధురం. మామిడి పండు తర్వాత అత్యధికంగా పోషకాలుండే పండు. అలాంటి సపోటా పండ్లను ఆరగించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
వంద గ్రాముల సపోటా ముక్కల తింటే అందులో 83 కేలరీల శక్తి ఉంటుంది. అందుకే ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
 
విటమిన్-సితో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఇవి మంచి "ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ సపోటాను మెనూలో క్రమం తప్పకుండా చేర్చుకోవచ్చు. వీటిలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.
 
మాంగనీసుతో పాటు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటి చూపు మెరుగవు తుంది. ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాల వల్ల జీవక్రియ మెరుగవుతుంది.
 
సపోటా గుజ్జును ముఖంపై రుద్దితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటి విత్తనాలతో చేసిన నూనెతో మర్జనం చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది సపోటా. పిండిపదార్థం అధికంగా ఉండే ఈ పండు సులువుగా జీర్ణమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు