మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

సిహెచ్

గురువారం, 13 ఫిబ్రవరి 2025 (22:26 IST)
మునగ చెట్టు ఆకుల నుండి హెర్బల్ టీ తయారు చేస్తారు. ఈ టీ తాగితే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మునగ ఆకులులో పలు ఔషధీయ గుణాలున్నాయి.
మునగ టీలో విటమిన్లు ఎ, సి, ఇ, అలాగే కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు వున్నాయి.
టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
ఈ మునగ ఆకు టీని క్రమంతప్పకుండా తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మునగ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
ప్రతిరోజూ మునగ టీ తాగడం వల్ల చర్మం కాంతివంతంగానూ, జుట్టు కూడా బలపడుతుంది.
ఈ టీని రోజూ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు