రైస్ కుక్కర్లు రాకముందు ప్రతి ఇంట్లో అన్నం వండి వార్చేవారు.. అలా అన్నం వార్చే సమయంలో వచ్చిన గంజిని కొంతమంది పెద్దలు ఉప్పు , నిమ్మరసం, బెల్లం ముక్క , పచ్చి మిర్చి టెస్టుకు తగినట్లుగా ఏదోకటి కలిపి వేడి వేడిగా తాగేవారు.
అప్పుడు గంజిలో ఉన్న పోషకాలు శరీరానికి అందేవి.. దాహం తీరేది. అయితే కాలంతో పాటే వచ్చిన మార్పుల్లో భాగంగా తినే తిండిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. గంజిని పక్కన పెట్టి.. టీ, కాఫీలు చేరాయి. ఇప్పుడు గంజిని వృథాగా పడేస్తున్నారు.
అయితే పోషకాహార నిపుణులు గంజితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. పడేసే ముందు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు. ఈరోజు గంజిలో ఉన్న పోషకాలను గురించి తెలుసుకుందాం..
గంజి తాగడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
జ్వరంతో ఉన్నవారు గంజి తాగితే.. శక్తి వస్తుంది. జ్వరం తగ్గుముఖం పడుతుంది.