మెంతి గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
ముఖ్యంగా, బెల్లీ ఫ్యాట్‌కు మెంతులు ఎంతగానో మేలుచేస్తాయి. తక్కువ కేలరీల టీ తాగాలనుకుంటే మెంతి టీ ఉత్తమం. ఈ టీ ప్రత్యేకత ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ (బొడ్డు చుట్టూ కొవ్వు)ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం నీటిలో వేసి మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతిరోజూ తాగితే బరువు కూడా సులభంగా తగొచ్చని గృహ వైద్యులు చెబుతున్నారు.