దాల్చినచెక్క ఆకలిని అణచివేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది.
జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క, శొంఠి, యాలుకలు, సైంధవ లవణ చూర్ణాలను సమానంగా కలిపి అర గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని అరచెంచా పొడిని పావు గ్లాసు నీటిలో కలిపి తాగితే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.