బొద్దింకను చంపేందుకు నిప్పు పెడితే.. అపార్టుమెంట్ తగలబడింది...

సెల్వి

బుధవారం, 22 అక్టోబరు 2025 (14:12 IST)
బొద్దింకను చంపేందుకు ఓ యువతి చేసిన ప్రయత్నం పెను ప్రమాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల యువతి తన అపార్ట్‌మెంట్‌లో కనిపించిన బొద్దింకలను తేలికపాటి మంటతో చంపడానికి ఓ లైటర్‌, ఫ్లేమబుల్ స్ప్రేను ఉపయోగించింది. అదే సమయంలో ఆమె అంటించిన మంటలు తన మంచం, ఇతర చెత్తపైకి వ్యాపించాయి. దీంతో  మంటలు చిలికి చిలికి పెద్దగా మారి మొత్తం అపార్ట్‌మెంట్ భవనమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో 30 ఏళ్ల చైనీస్ మహిళ మరణించింది. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది.
 
ఈ ఘటనలో పొరుగింటి మహిళ ఆమె భర్త, రెండు నెలల వయసున్న చిన్నారితో ప్రమాదం జరిగిన ఐదో అంతస్తు భవనంలోనే ఉంటున్నారు. ఈ ఘటనలో సదరు మహిళ భర్త, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. కానీ అయితే దురదృష్టవశాత్తూ ఆ మహిళ దూకే క్రమంలో కిందపడి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో మరో ఎనిమిది మంది నివాసితులు పొగ పీల్చడం వల్ల గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు