భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్

బుధవారం, 22 అక్టోబరు 2025 (15:14 IST)
భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమన్యస్థానం అని ఏపీ ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నారా లోకేశ్... భారత్ - ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీ రాష్ట్రానిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు.
 
ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలతో బ్రిస్బేన్‌లో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ మాట్లాడుతూ, భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య స్వేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. గత 16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో గూగుల్‌ ఏఐ హబ్‌ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వివరించారు. 
 
ఏపీలో పారిశ్రామికవేత్తల కోసం సులభతర పాలసీలు అమలుచేస్తున్నట్లు చెప్పారు ఆర్సెలార్ మిత్తల్‌ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోందని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా మారిందన్నారు. నవంబరులో 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025కి హాజరుకావాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు