గుండె నుంచి ప్రతి శరీర భాగానికి ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరుసగా కొన్నాళ్లపాటు బీట్ రూట్ రసం తాగించడం వల్ల.. కండరాలూ, శారీరం దృఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు.
నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ బీట్‌రూట్ రసానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి. కనీసం వారానికి రెండు సార్లయినా బీట్ రూట్‌ని ఆహారంలో తీసుకుంటే మంచిది.