బంతి చెట్టు వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బంతి పూలను దండలుగా గుచ్చి పండుగ రోజులలో ఇంటి గుమ్మానికి వ్రేలాడదీస్తారు. బంతిపూలను అనేక రకాల ఫంక్షన్స్, డెకరేషన్స్‌కు, దేవుడికి అలంకరణ చేయడానికి, ఇలా అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాము. అంతేకాకుండా దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బంతి పూవు మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.