తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

ఐవీఆర్

ఆదివారం, 27 జులై 2025 (11:09 IST)
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాడు డెన్వర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల రన్‌వేపై మంటలు, పొగలు రావడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అత్యవసర ద్వారా తెరిచి 173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
 
బోయింగ్ 737 MAX 8 విమానం మయామికి బయలుదేరింది. దాని టైర్‌లో నిర్వహణ సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్ మంటల్లో కనిపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు విమానం నుండి క్రిందికి జారుకుంటున్నట్లు రెస్క్యూ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటలకు డెన్వర్ విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు ల్యాండింగ్ గేర్ సంఘటన జరిగింది.
 

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు.. డెన్వర్ విమానాశ్రయంలో ఘటన

మంటలను గుర్తించి ప్రయాణికులను వెంటనే బయటకు పంపిన సిబ్బంది pic.twitter.com/G9lkdNT5KD

— Telugu Scribe (@TeluguScribe) July 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు