ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది. దీనిని సామాన్య పరిభాషలో 'రణపాల' అని పిలుస్తారు.