ద్రాక్ష పండ్లతో.. జీర్థవ్యవస్థ..?

శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:10 IST)
ద్రాక్ష పండు చాలా తియ్యగా, పులుపుగా ఉంటుంది. ద్రాక్ష పండ్లలో పలు రకాలున్నాయి.. అవి నలుపు ద్రాక్షాలు, ఎరుపు ద్రాక్షాలు, లేత పచ్చ ద్రాక్షాలు. నలుపు ద్రాక్షాలు తీసుకుంటే వాటిని తొక్కతో తినలేము. కానీ, లేత పచ్చ ద్రాక్షాలు తీసుకుంటే తొక్కతో తినవచ్చును. ఎందుకంటే ఈ పచ్చ ద్రాక్షాల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జ్వరంతో బాధపడేవారు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
 
ఈ ద్రాక్ష పండ్లలో విటమిన్ కే, సీ, బీటా కెరోటిన్, మెగ్నిషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ పచ్చ ద్రాక్షా పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ కడుపులోని మంటను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వీటిని తరచుగా డైట్‌లో చేర్చుకోవడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు