కావలసిన పదార్థాలు : గోధుమపిండి... ఒక కిలో మైదా... 400 గ్రా. రీఫైండ్ ఆయిల్... తగినంత నెయ్యి... 200 గ్రా. ఉప్పు... అర టీ. పంచదార... మూడు కిలోలు మంచినీరు... తగినంత లవంగాలు... సరిపడా యాలకుల పొడి... ఒక టీ. బేకింగ్ పౌడర్... రెండు టీ.
తయారీ విధానం : గోధుమ, మైదా, బేకింగ్ పౌడర్‌లు కలిపి అందులో ఉప్పు, కరిగించిన నెయ్యి పోసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ముద్దలా చేసి ఓ గంటసేపు నాననివ్వాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండనీ పలుచని పూరీలాగా చేసి...సగానికి కత్తిరించాలి. ఇప్పుడు ఒక్కో భాగాన్నీ మిఠాయి పొట్లంలా (కోన్‌లా) మడిచి విడిపోకుండా లవంగాన్ని గుచ్చాలి. ఇలా మొత్తం పిండినంతా చేసి పక్కన పెట్టుకోవాలి.
మందపాటి పాత్రలో పంచదార వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి యాలకుల పొడి కలిపి ఉంచాలి. కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ పూరీ పొట్లాలను వేస్తూ దోరరంగులో వేయించి తీసి వేడివేడి పంచదార పాకంలో ముంచాలి. పది నిమిషాలు పాకంలో ఊరాక ట్రేలో వరసగా వాటిని అమర్చి మిగిలిన పాకాన్ని పైన పోయాలి. అంతే నోరూరించే పాకం పూరీ పొట్లాలు రెడీ.