మసాలా రైస్

కావలసిన పదార్థాలు:
బాసుమతి బియ్యం : పావుకేజీ
ఉడికించిన బఠాణీలు : ఒక కప్పు
లవంగాలు : నాలుగు
దాల్చిన చెక్క : 5 గ్రాముల
పచ్చిమిర్చి : నాలుగు
ఉల్లిపాయలు: ఒక కప్పు (సన్నగా తరిగిన ముక్కలు)
నూనె లేదా నెయ్యి: 50 గ్రాములు
ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం:
ముందుగా బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిముక్కలను కుడా చేర్చి దోరగా వేయించాలి.

అనంతరం అందులో కడిగిన బియ్యం, బఠాణీలు, తగినంత ఉప్పును వేసి రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా కలిపి మూతపెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లి దించి ఆనియన్ రైతాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి