కావలసిన పదార్థాలు : పచ్చి మామిడికాయలు... మూడు కందిపప్పు... ఒక కప్పు నెయ్యి... 2 టీస్పూన్లు ఉప్పు... తగినంత జీలకర్ర, ఆవాలు, మెంతులు... పోపుకు సరిపడా పసుపు... అర స్పూను వెల్లుల్లి... 4 రేకలు
తయారీ విధానం : ముందుగా మామిడికాయలను సన్నగా తురుమి ఉంచుకోవాలి. నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలను పోపు పెట్టి తురిమి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి బాగా వేగించాలి. ఆ తరువాత పప్పు, పచ్చిమిరపకాయలు కూడా దానికి కలిపి సరిపడేంత నీరు పోసి బాగా ఉడికించి దించేయాలి. అంతే మామిడికాయ పప్పు రెడీ. మీరూ తయారు చేస్తారు కదూ...!