మామిడితో మ్యాజిక్ "రైస్‌ విత్‌ స్ప్రౌట్స్‌"

FILE
కావలసిన పదార్థాలు :
అన్నం.. నాలుగు కప్పులు
పుల్లటి మామిడికాయ తురుము.. ఒక కప్పు
ఉడికించిన బఠాణీ, చిక్కుడు గింజలు.. అర కప్పు చొప్పున
మొలకెత్తిన పెసళ్లు... అర కప్పు
జీడిపప్పు.. పావు కప్పు
క్యారెట్ తురుము.. అర కప్పు
పచ్చికొబ్బరి తురుము.. పావు కప్పు
అల్లంవెల్లుల్లి ముద్ద.. నాలుగు టీ.
గరంమసాలా.. నాలుగు టీ.
జీలకర్ర పొడి.. రెండు టీ.
పచ్చిమిర్చి.. 20
ఉప్పు, నూనె.. తగినంత
ఆవాలు, లవంగాలు, యాలకులు, కరివేపాకు, నెయ్యి, పుదీనా, కొత్తిమీర.. పోపుకు సరిపడా

తయారీ విధానం :
బాణలిలో నూనె వేడిచేసి పోపుకోసం తీసిన వస్తువులన్నింటినీ వేయించాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కోసిన పచ్చిమిర్చి, మొలకెత్తిన పెసలు, జీడిపప్పు, క్యారెట్‌ తురుములను ఒకదాని తరువాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకొన్న బఠాణీ, చిక్కుడు గింజలు చేర్చి, బాగా కలపాలి. సన్ననిమంటపై ఉంచి.. మామిడికాయ తురుము, గరంమసాలా, జీలకర్ర పొడి చేర్చాలి. చివర్లో అన్నం, కొబ్బరి తురుము, కొత్తిమీర, నెయ్యి, సరిపడా ఉప్పు వేస్తే.. నోరూరించే పోషకాల రైస్‌ విత్‌ స్ప్రౌట్స్ సిద్ధమైనట్లే..!!

వెబ్దునియా పై చదవండి