కావలసిన పదార్థాలు : కాకరకాయలు... ఎనిమిది ఉల్లిపాయలు.. మూడు కారం... రెండు టీ. ధనియాలపొడి... ఒక టీ. జీలకర్ర.. ఒక టీ. పసుపు... అర టీ. ఉప్పు, నూనె... తగినంత
తయారీ విధానం : పీలర్తో కాకరకాయలకు తొక్కును కొద్దిగా తీసివేయాలి. మరీ లోతుగా చెక్కకుండా పైపైనే తీసివేయాలి. కాకరకాయల మధ్యలో పొడవుగా గాటుపెట్టి, లోపలి గింజలను తీయాలి. వీటికి ఉప్పు, పసుపు పట్టించి.. ఓ గంటపాటు ఊరబెట్టాలి. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి.. కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల మధ్యలో కూరి బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే కాకరకాయ మసాలా సిద్ధమైనట్లే..!