Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

దేవీ

గురువారం, 10 జులై 2025 (12:29 IST)
Jyothi Krishna, Pawan Kalyan, A.M. Ratnam, Aishwarya, Ahana
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన చిత్రం హరి హర వీర మల్లు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈరోజు, చిత్ర సెట్ నుండి షూట్ వెనుక ఉన్న ఒక అందమైన ఫోటో ఆన్‌లైన్‌లో కనిపించింది, దర్శకుడు జ్యోతి కృష్ణ, అతని తండ్రి A.M. రత్నం, అతని భార్య ఐశ్వర్య, వారి కుమార్తె అహానాతో ఒక అందమైన క్షణాన్ని దర్శకుడు పంచుకున్నారు.
 
“నేను ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకునే చిత్రం. కేవలం వృత్తిపరమైన జ్ఞాపకం మాత్రమే కాదు, ఇది జీవితకాలంలో ఒక క్షణం, హరి హర వీర మల్లు దర్శకుడిగా మన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ పక్కన నిలబడటం ఇప్పటికీ నమ్మలేని ఆనందం, ఏదో తెలీని ఎమోషన్ దాగివుంది. ఈ సినిమా శక్తి లో దృఢ విశ్వాసాన్ని నమ్మడానికి గర్వపడటానికి నాకు ఒకటి కాదు, లెక్కలేనన్ని కారణాలు ఇచ్చిన వ్యక్తి.” అంటూ పేర్కొన్నారు.
 
"ఈరోజు ఆమె మొదటి పుట్టినరోజు. ఆ రోజు నుండి ఎంత జ్ఞాపకం ఉందో. కొన్ని ఫోటోలు కథలుగా మారాయి. ఇది నాకు ఒక వరంలా మారింది. ఇలాంటి క్షణాలకు కృతజ్ఞతలు " అని ఆయన అన్నారు. దీనికి సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమతో కూడిన హృదయపూర్వక శుభాకాంక్షలతో ముంచెత్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు