వంకాయ పులావ్

కావలసిన పదార్ధాలు:
బాసుమతి బియ్యం: పావుకేజీ
గుండ్రటి వంకాయలు: నాలుగు
ఉల్లిపాయలు : రెండు పెద్దవి
పచ్చిమిర్చి : పది
కారం: తగినంత
క్యారెట్ : రెండు
కొబ్బరి తురుము: అరకప్పు
నెయ్యి : పావు కప్పు
గరం మసాలా పొడి: ఓ చెంచా
జీలకర్ర: టీ స్పూన్
జీడిపప్పు: 10 గ్రాముల
ఉప్పు, : తగినంత

తయారు చేయు విధానం :
ముందుగా బాసుమతి బియ్యాన్ని బాగా కడిగి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్‌, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలను కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఓ బాణలిలో నెయ్యివేసి కాగాక అందులో జీలకర్ర, కారం, గరం మసాలా పొడి వేసి కొద్ది సేపు వేయించాలి.

అనంతరం అందులో ఉల్లిపాయ, క్యారెట్, వంకాయ ముక్కలను వేసి వేయించాలి. చివరగా కొబ్బరితురుము వేసి దోరగా వేగాక తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేయాలి.

వెడల్పు పాత్రలో రెండు గరిటలు నూనె వేసి అది కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలను, చికెన్ వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత దానికి మిగిలిన అజినామోటా, మిరియాల పొడి చల్లి ముక్కలకు బాగా పట్టేట్లు కలుపుతూ వేయించి దించేయాలి.

వెబ్దునియా పై చదవండి