వేసవిలో ఉసిరికాయ నువ్వుల పచ్చడి రుచి చూడండి..!!

బుధవారం, 11 ఏప్రియల్ 2012 (12:31 IST)
FILE
కావలసిన పదార్థాలు :

ఉసిరికాయలు - కేజీ,
నువ్వులు - పావు కేజీ,
నిమ్మకాయలు - 8,
వెల్లుల్లి - 50 గ్రా,
మెంతిపొడి - 50 గ్రా,
ఉప్పు, కారం - రుచికి తగినంత,
కరివేపాకు రెబలు -2,
ఇంగువ - చెంచా,
పోపు దినుసులు - మూడు చెంచాలు,
ఎండుమిర్చి - నాలుగు,

తయారీ విధానం :

మొదట ముందురోజు నిమ్మకాయలను పిండి రసం తీసి ఎండలో ఉంచాలి. మరుసటి రోజు నువ్వులను దోరగా వేయించి చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయల పొట్టు తీసి దంచుకోవాలి. ఉసిరికాయలను కడిగి తడిలేకుండా తుడిచి చాకుతో చిన్న చిన్న గాట్లు పెట్టి నూనెలో మగ్గించాలి.

నూనె చల్లారాక అందులో కారం, ఉప్పు, మెంతిపొడి, వెల్లుల్లి పేస్టు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. తరువాత చిన్న బాణలిలో నూనె కొద్దిగా వేడి చేసి అందులో ఇంగువ ఎండుమిర్చి, కరివేపాకు, పోపుదినుసులు వేయించి దించేయాలి.

ఆ తాలింపులో ముందురోజు ఎండలో ఉంచిన నిమ్మరసం చేర్చి. ఉసిరికాయల్లో కలపాలి. నిమ్మరసాన్ని ఎండలో ఉంచడం వల్ల పచ్చిడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాదు పెరుగన్నంలో నంజుకోవడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి