కావలసిన పదార్థాలు : సొరకాయ... చిన్నసైజుది ఒకటి కందిపప్పు... రెండు కప్పులు, పచ్చికొబ్బరి... ఒక చిప్ప మిరియాలు... పది దనియాలు... 4 టీ. ఎండు మిరపకాయలు... మూడు మినప్పప్పు... ఒక టీ. కరివేపాకు... రెండు రెమ్మలు జీలకర్ర... పావు టీ. నూనె... రెండు టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : సొరకాయ తొక్కు తీసి మీడియం సైజులో ముక్కలు కోయాలి. కుక్కర్లో కందిపప్పు, సొరకాయ ముక్కలు, మూడు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. తరవాత కొబ్బరి, ధనియాలు, మిరియాలు కలిపి పేస్టులా రుబ్బాలి. ఇప్పుడు ఈ పేస్టును కందిపప్పు ఉడికించిన కుక్కర్లో వేయాలి.
ఉప్పు, పచ్చి కరివేపాకును కూడా కుక్కర్లో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. చివరగా దీన్ని తాలింపు పెడితే సొరకాయ కూటు సిద్ధం. ఇది రొట్టెల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది.