కావలసిన పదార్థాలు : కంది పప్పు: 40 గ్రాములు క్యాబేజీ: 175 గ్రాములు నిమ్మకాయ: ఒకటి జీడిపప్పు: ఐదు పచ్చిమిరప: ఆరు అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు: ఒక టీ స్పూన్ ఇంగువ, ఆవాలు: 1/2 టీ స్పూన్లు నూనె: రెండు టీస్పూన్లు
తయారీ విధానం: క్యాబేజీని తురుముకొని ఉప్పు నీటిలో ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయల్ని వేయించి కలుపుకోవాలి. ఆవాలు, జీడిపప్పులను బాణలిలో వేయించుకోవాలి. ఉడికించిన క్యాబేజీని వేసి కాస్త నీటిలో మరిగించాలి. బాగా మరిగాక దించుకొని వాటిలో కొత్తిమీర తురుమును నిమ్మకాయ రసాన్ని ఇంగువ నీటిని కలుపుకొని దించుకోవాలి.