ఘుమఘుమలాడే బెండకాయ టమోటో సూప్

సోమవారం, 19 మే 2008 (16:27 IST)
సూప్‌లంటే ఇష్టపడనివారుండరు. వేడిగా సూప్ గొంతులో దిగుతుంటే ఆ రుచే వేరు. అందుకే హోటల్‌కు వెళ్లినపుడు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేలోపు ఓ కప్ సూప్ లాగించేయడం కొందరి ఆనవాయితీ. అందుకే ఘుమఘుమలాడే ఓ రుచికరమైన బెండకాయ టమోటో సూప్ ఐటంని మీకు పరిచయం చేస్తున్నాం.

ఈ సూప్ తయారీకి కావాల్సినవి : బెండకాయలు పావుకిలో, టమోటోలు అరకేజీ, కొంచెం నూనె, బియ్యం పొడి, మిరియాలపొడి రెండేసి చెంచాలు, వెజిటేబుల్ స్టాక్ (దీనికోసం లీటరులో మూడోవంతు నీటిలో కప్పు క్యారెట్ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం దాల్చినచెక్క, కొన్ని మిరియాలు, కొంచెం కొత్తిమీర వేసి మంటపై ఉడికించాలి)

సూప్ తయారు చేసే విధానం : బెండకాయల్ని సన్నని ముక్కలుగా కోసి నూనెలో దోరగా వేయించి పక్కనబెట్టాలి. ఉడికించిన వెజిటెబుల్ స్టాక్‌లో మెత్తగా రుబ్బిన టమోటాల గుజ్జును వేసి మళ్లీ మంటపై మరగించాలి.

ఇలా కొంతసేపు ఉడికాక బియ్యం పొడిని కూడా ఇందులో కలిపి చిక్కబడనీయాలి. చివరగా ఉప్పు, మిరియాలు పొడివేసి దించేయాలి. ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి కలియబెట్టాలి. ఇలా తయారుచేసిన సూప్‌ను వేడిగా ఉన్నప్పుడే ఆరగిస్తే కమ్మగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి