దానిమ్మ పచ్చడి

ఉల్లితో చేసే పెరుగు పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. అలాగే దానిమ్మతో చేసేదైతే ఇంకెంత బావుంటుందో... వింటేనే నోరూరుతోందిగా. దక్షిణ తమిళనాడులోని ఓ ప్రాంతానికి చెందిన హోటళ్లలో ఈ తరహా వంటకాన్ని మీరు చూడొచ్చు. వేసవి కాలంలో తీసుకుంటే శరీరానికి కూడా మంచిది.

కావాల్సిన పదార్థాలుః
దానిమ్మ పండ్లు- 1
పెరుగు- ఒకటిన్నర కప్
పెద్ద ఉల్లి- 1
పచ్చి మిరపకాయ- 1
ఉప్పు- తగినంత

తయారీ విధానం:
తోలు తీసిన ఉల్లిని పొడవాటి ముక్కలుగా తరగాలి. అలాగే పచ్చి మిరపకాయలను పొడవుగా ముక్కలు చేయాలి.

ఉల్లి, ఉప్పు, పచ్చి మిరపకాయలను బాగా మిక్స్ చేయండి. ఓ గిన్నెలో పెరుగు తీసుకుని అందులో ఆ మిశ్రమాన్ని చేర్చండి.

భోజనం చేసే సమయంలో దానిమ్మ గింజలను ఆ పచ్చడి మిశ్రమంలో చేర్చి వడ్డించండి. ఆ గింజలు ఎర్రగా ఉంటే పెరుగుతో కలిసిన సమయంలో రుచికరమైన పచ్చడిగా తయారు కాగలదు.

వెబ్దునియా పై చదవండి