ర్యాడిష్ టమోటా

సోమవారం, 24 మార్చి 2008 (12:14 IST)
కావలసిన పదార్థాలు :
ముల్లంగి - పావుకిలో, టమోటా - రెండు, బంగాళదుంపలు - రెండు, నీరుల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర చెంచా, పసుపు - చిటికెడు, కారం - చెంచా, నూనె - వేయించడానికి సరిపడ, తాలింపు దినుసులు - చెంచా.

తయారు చేయు విధానం :
ముందుగా ముల్లంగి, బంగాళదుంపల తోలు తీసి కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమోటాలను చిన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లను వేసి వేయించాలి. తర్వాత ఇందులో ముల్లంగి, బంగాళ దుంప ముక్కలు, పసుపును వేయాలి. ఇందులో కావలసినంత ఉప్పు, కారాలు వేసి వేగాక టమోటా ముక్కలను కూడా వేసి వేపాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి