ఈ సీజన్‌లో వానలకు ఇంటి గోడలు, ఫర్నీచర్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. అంతేకాదు టెర్రస్ మీద నాచు, ఫంగస్ పెరిగే అవకాశమెక్కువ. కిచెన్‌లో కూరగాయలు తొందరగా పాడవుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివాటిని అధిగమించవచ్చు.
ఈ కాలంలో కూరగాయలు తొందరగా కుళ్లిపోతాయి. కాబట్టి వాటిని కాగితంలో చుట్టి, ఫ్రిజ్‌లో ఉంచాలి. మసాలా దినుసులను వేగించి, బిగుతైన డబ్బాలో ఉంచితే వాటి ఘాటు, వాసన అలానే ఉంటుంది.