అన్నా స్ఫూర్తి: అవినీతికి వ్యతిరేకంగా పాకిస్థానీ దీక్ష

గాంధేయవాది అన్నా హజారే నుంచి స్ఫూర్తి పొందిన 68 ఏళ్ల పాకిస్థాన్ వ్యాపారవేత్త ఒకరు తమ దేశంలో వెళ్లూనుకున్న అవినీతికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 12 నుంచి ఇస్లామాబాద్‌లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. హజారేను ప్రసంశించిన జహంగీర్ అక్తర్ పాకిస్థాన్‌లో అవినీతి పెద్ద రోగంగా మారిందని విమర్శించారు.

భారత్ తయారుచేయనున్న అవినీతి వ్యతిరేక చట్టం మాదిరిగానే పాకిస్థాన్ పార్లమెంట్ కూడా చట్టాన్ని తీసుకురావాలని అక్తర్ డిమాండ్ చేస్తున్నారు. అవినీతి భారత్‌లో కంటే పాకిస్థాన్‌లో ఎక్కువగా ఉందని ఫోటోగ్రఫీ బిజినెస్ నిర్వహించే అక్తర్ ఇస్లామాబాద్‌ నుంచి టెలిపోన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా అవినీతికి వ్యతిరేకంగా అక్తర్ గొంతెత్తి పోరాడటం ఇది తొలిసారి కాదు.

అవినీతిని ప్రక్కన బెడితే భారత్‌పై వ్యతిరేకత కారణంగా పాకిస్థాన్‌ తన రక్షణ బడ్జెట్‌ను పెంచుతూపోవడంపై కూడా అక్తర్ తన నిరహార దీక్షలో లేవనెత్తనున్నాడు. 2011-12 సంవత్సరానికి గానూ పాకిస్థాన్ రూ.2,504 బిలియన్ల బడ్జెట్‌లో రూ.495 బిలియన్లను రక్షణ శాఖకు కేటాయించింది.

వెబ్దునియా పై చదవండి