అమెరికాలో తీవ్రవాద ఆరోపణలపై ఏడుగురి అరెస్ట్

అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఆరుగురు అమెరికన్లతో సహా మొత్తం ఏడుగురు వ్యక్తులను అధికారిక యంత్రాంగం తీవ్రవాద ఆరోపణలపై అరెస్టు చేసింది. హింసాత్మక జీహాద్‌తో సంబంధాలు పెట్టుకునేందుకు కుట్రపన్నినట్లు వీరిపై అభియోగాలు నమోదు చేశామని న్యాయశాఖ తెలిపింది.

నిందితులందరూ 20 నుంచి 39 ఏళ్లలోపు వయసువారే. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు, మరొకరు ప్రవాసుడు. వీరందరినీ అరెస్టు చేసిన వెంటనే ఉత్తర కరోలినాలోని రాలీగ్‌లో ఫెడరల్ జడ్జి ముందు హాజరుపరిచారు. వీరందరిపై హత్య, కిడ్నాప్, తీవ్రవాదులకు మద్దతుకు కుట్ర, తదితర అభియోగాలు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి