పవిత్ర రంజాన్ ఉపవాస మాసం ముగింపు సంబరాలైన ఈద్ ఉల్ పిత్ర్‌ను అరబ్ ప్రపంచం ఆగస్ట్ 31న జరుపుకోనుంది. చాలా వరకు ముస్లీం దేశాలు ఆగస్ట్ 31న ఈద్ పర్వ దినాన్ని జరుపుకుంటాయని అబుదాబీ కేంద్రంగా పనిచేసే ఇస్లామిక్ నెలవంక పరీశీలక ప్రాజెక్ట్ (ఐసీఓపీ) పేర్కొంది. రంజాన్ తర్వాత వచ్చే షావల్ మాస ప్రారంభానికి నెలవంక కనిపించడం తప్పనిసరి.
అనేక దేశాలు ఆగస్ట్ 1న రంజాన్ ఉపవాస మాసాన్ని ప్రారంభించాయని ఐసీఓపీ ప్రకటించినట్లు యూఏఈ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఆగస్ట్ 31నే నెలవంక కనిపించడం అసాధ్యమని ఐసీఓపీ వెల్లడించింది. కాగా మధ్యాసియాతో పాటు యూఏఈ, ఖతార్, బహ్రైయిన్, కువైట్, ఉత్తర, కేంద్ర సౌదీ అరేబియా, ఇరాక్, ఉత్తర ఆఫ్రికాల్లో ఆగస్ట్ 31న నెలవంక కనిపిస్తుందని తెలిపింది. ఆగస్ట్ 29న చంద్రుడు కనిపించే దేశాలు ఆగస్ట్ 30న ఈద్‌ను జరుపుకుంటాయి.