అలస్కాకు చెందిన అల్యూసియన్ ద్వీపంలో బుధవారం తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని అమెరికా భూకంప శాస్త్రజ్ఞులు తెలిపారు.
గత ఇరవై నాలుగు గంటలలో అలస్కాలో రెండు సార్లు భూమి కంపించిందని అమెరికా భూగర్భపరిశోధనా సంస్థ తెలిపింది. ఈ భూకంపం స్థానిక సమయానుసారం మధ్యాహ్నం గం. 12.21 నిమిషాలకు జరిగింది.
ఈ భూకంపం నికోలస్కీ ఒడ్డునుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో 13.7 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని అమెరికా భూగర్భపరిశోధనా సంస్థ తెలిపింది.