ఆగస్ట్ 30న రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని

అపఖ్యాతి మూటగట్టుకొన్న జపాన్ ప్రధానమంత్రి నొవొటో కన్ ఆగస్ట్ 30న రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ ఆర్ధికమంత్రి మంగళవారం వెల్లడించారు. అణు సంక్షోభంతో పాటు అనేక ఆర్థిక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితుల్లో తదుపరి ప్రధాని ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత వెలువడలేదు.

గత ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులను జపాన్ ప్రజలు చూశారు. 49 ఏళ్ల మాజీ విదేశాంగమంత్రి సీజీ మయిహరా ప్రధాని పదవి రేసులో ఉన్నారు. అయితే ఆర్ధికమంత్రి యోషిహికో నోడాకు ప్రధాని రేసులో ముందున్నారు. మార్చి 11న సంభవించిన భూకంపం, సునామీలతో ఏర్పడ్డ పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలమైన నొవొటో కన్ గద్దెదిగాలని ప్రతిపక్షాలతో పాటు క్యాబినేట్‌లోని 15 శాతం మంది మంత్రులు ఒత్తిడిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కన్ తన అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకొన్నారు.

వెబ్దునియా పై చదవండి