ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటన్ వ్యయం 18 బిలియన్ ఫౌండ్లు

ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటరీ కార్యకలాపాల కోసం బ్రిటన్ అధికారిక అంచనాల ప్రకారం 18 బిలియన్ ఫౌండ్లు(సుమారు 29 బిలియన్ డాలర్లు) వ్యయం చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది. హౌస్ ఆఫ్ కామన్స్ రక్షణ కమిటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం లిబియాలోని లక్ష్యాలపై బాంబుదాడులు చేయడానికి 260 మిలియన్ ఫౌండ్ల ఖర్చు అయింది. ఇది దాదాపు 424 మిలియన్ డాలర్లకు సమానం.

ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని గార్డియన్ తన కథనంలో చెప్పింది. ఆఫ్ఘానిస్థాన్‌లో కార్యకలాపాల వ్యయం పూర్తిగా తెలియకుండానే లిబియాలో బ్రిటీష్ మిలిటరీ కార్యకలాపాల వ్యయాన్ని అంచనావేయడం తొందరపాటే అవుతుందని ఆ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది ఆఫ్ఘన్‌లో సైనిక ఆపరేషన్స్ కోసం 4 బిలియన్ ఫౌండ్ల కంటే ఎక్కువ వ్యయం కావచ్చని రక్షణ కమిటీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి