హన్సిక ఇటీవల తన తల్లితో, సోహేల్‌తో తన తల్లిదండ్రులతో నివసిస్తుందని వార్తలు వచ్చాయి. తమిళ, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటి హన్సిక ఈ పుకార్లపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోహేల్ విడాకుల ఊహాగానాలను ఆమె ఖండించింది. అవి అవాస్తవమని పేర్కొంది. గాఢంగా ప్రేమించి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని.. ముచ్చటగా మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడిపోతుండడం దారుణమని చెప్పుకొస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు నడుస్తున్నాయని, భర్తపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన హన్సిక.. తల్లి దగ్గరే ఉంటుందని, త్వరలోనే విడాకులు తీసుకొనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే హన్సిక మౌనం వీడాల్సిందే.