ఇదెక్కడి శిక్ష: చిన్న దొంగతనానికే చేతులు నరికేస్తారా..!!

బుధవారం, 5 జనవరి 2011 (10:23 IST)
ప్రపంచం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న కొన్ని చట్టాలు, మూఢ విశ్వాసాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. రాజుల కాలం నాటి రాక్షస పాలనే నేటికి కొన్ని ప్రాంతాలలో అమలు అవుతుంది.

చిన్న దొంగతనం చేసిన నేరానికి ఓ వ్యక్తి రెండు చేతులను నరికేశారు పాకిస్థాన్ తాలిబన్లు. వాయువ్య పాకిస్థాన్‌లోని ఒరాక్‌జయి గిరిజన ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ ఖలీక్‌ అనే వ్యక్తి దొంగతనం చేసి, ఆ నేరాన్ని అంగీకరించినందుకు అతడి రెండు చేతులను తాలిబాన్లు నరికేశారు.

తాలిబన్లు అధికారంలో ఉండే.. ప్రాంతాలలో ఇలాంటి కిరాతక చర్యలు తరచూ జరుగుతుండంటం సహజమే. వారు ఏర్పాటు చేసుకున్న 'షరియా' (ఇస్లామిక్‌ కోర్టు)లో చట్టాలను అనుసరించి ఇలాంటి శిక్షలు విధిస్తుంటారు. ప్రభుత్వం తరపున గూఢచర్యం చేస్తున్నాడనే నెపంతో తమ సహచర మిలిటెంటుకు శిరచ్ఛేదం (తల నరికి వేయడం) శిక్ష విధించిన మరుసటి రోజే ఈ సంఘటన జరిగింది.

వెబ్దునియా పై చదవండి