ఎన్‌ఎస్‌సీలో భారత్‌కు ప్రత్యేక విభాగం : అమెరికా

భారతదేశంతో పటిష్టాత్మకమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనే కోరిక అమెరికా అధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్ ఒబామాకు బలీయంగా ఉంది. అతని కోరికను అమలు చేసే చర్యల్లో భాగంగా అమెరికా తన జాతీయ భద్రతా మండలిలో(ఎన్‌ఎస్‌సి)భారత దేశానికి ప్రత్యేక విభాగాన్ని రూపొందించింది.

జాతీయ భద్రతా మండలిలో ప్రత్యేక విభాగం హోదా దక్కిన దేశాలలో భారత్ రెండో దేశం. రష్యాకు ఇలా ప్రత్యేక విభాగముంది. ఈ ప్రత్యేక విభాగం వ్యవహారాలను ఎన్‌ఎస్‌సి సీనియర్‌ డైరెక్టర్‌ డొనాల్డ్‌ క్యాంప్‌ చూస్తారు. భారతదేశానికి ఒబామా ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నారో దీనిద్వారా వెల్లడవుతోందని వైట్‌హౌస్ అధికారలు భావిస్తున్నారు.

భారత్...అమెరికా సంబంధాలు కొత్తపుంతలు తొక్కాలని ఒబామా ఆసక్తితో ఉన్నారు. మేం ఇటీవల ఎన్‌ఎస్‌సిని స్వల్పంగా పునరుద్ధరించాం. ఇండియాకు ప్రత్యేకంగా డొనాల్డ్‌ క్యాంప్‌ను సీనియర్‌ డైరెక్టర్‌గా ఎన్‌ఎస్‌సి నియమించింది.

భారత్‌తో సంబంధాలపై అమెరికా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇలా ప్రత్యేక విభాగం ఏర్పాటు అసాధారణ చర్య అని ఎన్‌ఎస్‌సి ప్రతినిధి మైక్‌ హామర్‌ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి