కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేయబోము: అమెరికా

భారత్, పాకిస్థాన్ దేశాలకు మధ్య నెలకొన్న కాశ్మీర్ వివాదంలో తాము మధ్యవర్తిత్వం వహించబోమని అమెరికా తెలిపింది.

భారత్, పాకిస్థాన్ దేశాలకు మధ్య నెలకొన్న కాశ్మీర్ వివాదంలో తాము మధ్యవర్తిత్వం వహించబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌కు చెందిన డాన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రసంగిస్తూ... భారత్, పాకిస్థాన్ దేశాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు. దీంతో ఇరు దేశాల ప్రజల భవిష్యతు బాగుంటుందని ఆయన సూచించారు.

భారతదేశం మాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేశం, అలాగే పాకిస్థాన్‌కూడా. తమ మిత్రులిరువురు కూడా పోరాడుకుంటుంటే తమకు బాధ కలిగిస్తుందని, కాబట్టి పోరాటాన్ని వదలి సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తాము ఇరు దేశాలకుకూడా ఇలా చేయండి, అలా చేయండి అని ఆదేశించలేమని, ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యను ఇరు దేశాల ప్రజల సౌభాగ్యం కోసం చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.

ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తు...తాము మధ్యవర్తిత్వం వహించేందుకు ఇష్టపడమని, ఇరు దేశాల ప్రగతిని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి